● 531 ఫోన్లు సీజ్.. బాధితులకు అప్పగింత.
కడప అర్బన్: పోయిన, దొంగిలించిన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులు మరో ఘనత సాధించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ఆపరేషనన్ మొబీ ట్రాక్’లో కేవలం 60 రోజుల్లోనే 531 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. వీటి అంచనా విలువ రూ.1.06 కోట్లు. రికవరీ చేసిన ఫోన్లను సంబంధిత బాధితులకు తిరిగి అప్పగించారు. 2026 జూలై 8 నుంచి సెప్టెంబరు 4 వరకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషనన్‌లో ఈ ఫలితాన్ని సాధించినట్లు వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. తాజా రికవరీతో కలిపి ‘ఆపరేషనన్ మొబీ ట్రాక్’లో ఇప్పటివరకు 10 దశల్లో 7,018 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం అంచనా విలువ రూ.13.73 కోట్లుగా ఉందన్నారు.శనివారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలోని ‘పెన్నార్’పోలీస్ కాన్ఫరెన్స్’హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.
] పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు పోలీసులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్, ఐఎంఈఐ ఆధారిత విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్స్, నెట్‌వర్క్ ట్రాకింగ్, డేటా అనాలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. వివిధ నెట్‌వర్క్‌లలో మొబైల్ పరికరాల కదలికలను విశ్లేషిస్తూ వాటి ఆచూకీని గుర్తించి రికవరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సిబ్బందికి ప్రశంసా పత్రాలు
మొబైల్ ఫోన్ల రికవరీలో డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ ఇనన్‌స్పెక్టర్ ఎ. మధు మల్లేశ్వర రెడ్డిని ఎస్పీ అభినందించారు. రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సీఎస్‌కే ప్రసాద్ వర్మ (ఏఎస్‌ఐ), సలవాడి మారుతిరావు (ఏఎస్‌ఐ), బి. గంగాధర్ (హెచ్‌సీ), కె.బి.వి. కృష్ణారెడ్డి (పీసీ), సి. సురేష్ (పీసీ), ఎన్. చంద్రనారాయణ రెడ్డి పీసీ)లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజల ఆస్తి, డిజిటల్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌తో అనుసంధానం చేసి మరిన్ని మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ వివరించారు. తాము పోగొట్టుకున్న మొబైల్‌ఫోన్‌లను రికవరీ చేయించిన జిల్లా ఎస్పీకి బాధితులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్ పాల్గొన్నారు.
ఫిర్యాదు చేసిన గంటలోనే ఫోన్ రికవరీ
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు పట్టణంలోని బ్యాంక్ కాలనీకి చెందిన రిటైర్డ్ అగ్నిమాపకశాఖ అధికారి నార్ల సత్యంరెడ్డి వద్ద నుంచి శనివారం ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసుకోని ఇస్తానని నమ్మబలికి మొబైల్‌తో పరారయ్యాడు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీస్‌లు స్పందించి సాంకేతిక పరిజ్ఞానంతో లోకేషన్ గుర్తించి మొబైల్ స్వాధీనం చేసుకున్నాడు. బాధితుడి అప్పగించినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు.


