ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిధిలో రాయలసీమ రైలులో చోరి చేసిన ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ. 50 వేలు విలువచేసే ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల రైల్వే సీఐ సుధాకర్ రెడ్డి శనివారం తెలియజేశారు.
పురస్కారం అందజేత
రాజంపేట: అన్నమాచార్య యూనివర్సిటీలో శనివారం ఉపాధ్యాయదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా సర్వేపల్లె రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏయూ ఛాన్సలర్ డాక్టర్ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లె రాధాకృష్ణన్ విద్యారంగానికి అపూర్వమైన సేవలందించారన్నారు.విద్యార్ధులలో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిచారన్నారు. ఎయూలోని 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులకు పురస్కారాలను చొప్పాగంగిరెడ్డి అందచేశారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబరెడ్డి, ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పాఎల్లారెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీన్లు, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, భోదనసిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
కడప అర్బన్: కడప పరిధిలో ఎకై ్సజ్, చింతకొమ్మదిన్నె, చెన్నూరు, మహిళా పోలీస్ స్టేషన్‌లలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కరించుకోవాలని కడపలోని మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి విజయలక్ష్మి అన్నారు. ఈనెల 12న జాతీయ జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టు పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బందిని ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ రాజీ కాదగిన సివిల్ క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ రాజీ విషయాలలో ఏదైనా తమ వంతు సహాయం కావాలంటే చేస్తామన్నారు.


