కడప సిటీ : క్రీస్తు ప్రభువు సర్వమానవాళికి ఆదర్శనీయులని, ఆయన మార్గం అనుసరణీయమని రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తెలిపారు. కడప ఆరోగ్యమాత చర్చిలో నిర్వహిస్తున్న తిరునాల ఉత్సవంలో భాగంగా ఎనిమిదో తేరును అలంకరించి ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. తొలుత రెవరెండ్ ఫాదర్ అశోక్ దివ్యబలి పూజ చేపట్టారు. ఈ సందర్బంగా ఫాదర్‌జోసెఫ్ తన సందేశంలో మనందరి పాపాలను అవమానాలను క్రీస్తు ప్రభువు భరిస్తాన్నారన్నారు. క్రీస్తు ప్రభువు సమస్యలను ప్రేమతో ఎదుర్కొన్నారని, శ్రతువులను సైతం ప్రేమించాలని, వారి కోసం ప్రార్థించాలని, ఇతరుల తప్పులను హృదయ పూర్వకంగా క్షమించాలని తెలియజేశారన్నారు. చివరగా మరియతల్లి గొప్పతనం, ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుణ్య క్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎల్.ఆరోగ్యస్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు.


