30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ విధానంలో టెట్‌ను అటెండ్ చేయడం కష్టతరం. కావున వారికి ఆఫ్‌లైన్ విధానంలో టెట్‌ను నిర్వహించాలి. ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది
– సింగారెడ్డి అమర్‌నాథరెడ్డి,
వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో కూడా స్పెషల్ టెట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలి. ఇన్ సర్వీస్ టీచర్ల బోధ న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను పునః పరిశీలించి అందరికి స మానంగా 40 శాతం మార్కులు ఉండేలా నిబంధనలు సవరించాలి. – కందుల వెంకటసుబ్బారెడ్డి,
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్.
తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసంచేసింది. – పాలకొండయ్య,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.


