ఆధునిక హంగులతో ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

ఆధునిక హంగులతో ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయం

Sep 4 2026 1:24 AM | Updated on Sep 4 2026 1:24 AM

ప్రొద్దుటూరు క్రైం : పోలీసు అధికారులు, సిబ్బంది విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు, కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రొద్దుటూరు ఎస్డీపీఓ కార్యాలయాన్ని ఆధునిక హంగులతో పునరుద్ధరించారు. ఈ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పోలీస్‌ శాఖకు ప్రజలు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యాలయ పునరుద్ధరణకు ప్రొద్దుటూరులోని డాక్టర్‌ స్వరూప్‌కుమార్‌రెడ్ది, సీబీఐటీ జయచంద్రారెడ్డి, కేవీఆర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డి, నాగార్జున హాస్పిటల్‌ డాక్టర్‌ ఎన్‌ నాగార్జున, దండపాణి శ్రీనివాసకుమార్‌, గౌతమి ఇంజినీరింగ్‌ కాలేజి నాగూర్‌బాషా, శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం ఎస్‌ నాగిరెడ్డి తదితరులు తమ వంతు ఆర్ధిక సహకారం అందించారన్నారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ చొరవతో దాతలు, పోలీసు అఽధికారులు, సిబ్బంది సమన్వయంతో పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె ప్రకాష్‌బాబు, ఏఎస్పీ విభూకృష్ణ, సీఐలు టీవీ కొండారెడ్డి, నాగభూషణ్‌, రామాంజనేయుడు, వంశీనాథ్‌, భాస్కర్‌, ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, శ్రీకాంత్‌, రాజు, రాఘవేంద్రారెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

ప్రారంభించిన జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement