కడప అర్బన్ : కడప రీజినల్ విజిలెన్‌న్స్ అండ్ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( ఎస్‌పి–ఎన్‌సీ)గా ఎన్. వెంకట రామాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప కో–ఆపరేటివ్ కాలనీలో జిల్లా రీజనల్ విజిలెన్‌న్స్ కార్యాలయంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. పదోన్నతిపై ఆయన కడప విజిలెన్‌న్స్ అండ్ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. పల్నాడు జిల్లాకు చెందిన ఈయన 2012 గ్రూప్–1 పరీక్షలో విజయం సాధించి డీఎస్పీగా పోస్టింగ్ పొందారు. డీఎస్పీగా కదిరి, అనంతపురం, మార్కాపురం, చిత్తూరులో పనిచేశారు. 2021లో అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పనిచేశారు. అక్కడనుండి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏడీసీగా పనిచేస్తుండగా ఎస్పీగా (నాన్ క్యాడర్ ఐపీఎస్) పదోన్నతి పొందారు. కడప విజిలెన్‌న్స్‌కు బదిలీపై వచ్చారు.
బైక్ అదుపు తప్పి
యువకుడు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని తాళ్లమాపురం క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగడి ప్రసన్నకుమార్ (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ కడపలోని డిక్సన్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను ప్రొద్దుటూరుకు వెళ్లే క్రమంలో తాళ్లమాపురం క్రాస్ రోడ్డు సమీపంలోని ఎస్సీ కాలనీ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ల వద్ద బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం : తమ కుమారుడి మృతికి స్పీడ్ బ్రేకర్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ప్రధాన కారణమని ప్రసన్నకుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కేబుల్ తీగల చోరీ
సదుం : బోరు కేబుల్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. ఊటుపల్లె పంచాయతీ తుమ్మగుంటపల్లె సమీపంలోని పొలాల వద్ద రమణయ్య, కృష్ణయ్య, జనార్ధన, బసవయ్య, అశోక్, నాగలక్ష్మీ, రెడ్డెప్ప తదితరులకు చెందిన మోటర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు చెప్పారు.


