వివాదంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేబ్రిడ్జి ! | - | Sakshi
Sakshi News home page

వివాదంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేబ్రిడ్జి !

Aug 8 2026 1:35 AM | Updated on Aug 8 2026 1:35 AM

జగతికట్ట నుంచి కాకుండా...

ఏటిలో నిర్మాణం

200 మీటర్ల దూరం నుంచి బ్రిడ్జి పనులు

ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో

వరదనీటి ముప్పు

రాజంపేట: నందలూరు చెయ్యేరు నదిపై హై లెవల్‌ వంతనె (బ్రిడ్జి) నిర్మాణం అంశం ఇప్పుడు వివాదంలో పడింది. జగతి కట్ట నుంచి కాకుండా పాతవంతెన ప్రకారం నిర్మాణం చేపట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో వరదనీటి ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దారితప్పిన బ్రిడ్జి నిర్మాణం..

చెయ్యేరు నదిపై గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. కట్టపై నుంచి కాకుండా 200 మీటర్ల దూరంలో నిర్మాణ పనులు చెయ్యేరు నదిలో చేపట్టారు.బ్రిడ్జి నిర్మాణ వ్యవహారంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంపై వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెన నిర్మాణం దారి తప్పినట్లుగా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement