చెప్పేదే ధర.. చేసేదే చట్టం! | - | Sakshi
Sakshi News home page

చెప్పేదే ధర.. చేసేదే చట్టం!

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

రాజంపేట : బియ్యం ధరలకు రెక్కొలచ్చాయి. నిత్యావసర సరుకలతో పోటీపడుతూ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఒకే సారి రూ.100 పెంచేయడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో పెద్దగా వర్షాలు కురువకపోవడంతో మరింత సమస్యగా మారింది. బియ్యం ధరలకు కళ్లెం వేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. దళారుల దగాను అడ్డుకోలేకపోతోందని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా..ఏ ప్రాంతంలోనైనా వ్యాపారులు బియ్యం బస్తాల ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడంలేదు. ఈ ప్రభావం ప్రస్తుత ఖరీఫ్‌పై పడింది. దీంతో వచ్చే ఏడాది పంట దిగుబడి తగ్గనుంది. రానున్న రోజుల్లో డిమాండ్‌ ఏర్పడి , ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సాకుతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం,సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని సామాన్యులు పెదవివిరుస్తున్నారు.

నెలకో విధంగా..

ఈ ఏడాది మార్చి నెల నుంచి క్రమంతప్పకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు ప్రజలంతా స్టీమ్డ్‌ రైసును వినియోగిస్తున్నారు. నాలుగునెలతో పోలిస్తే 26 కేజీల బస్తాపై సుమారు రూ.400 పెరిగింది. మిల్లుల వద్ద సాధారణ రకం సుమారు 26 కిలోలు రూ.950కి లభిస్తోంది. సీఆర్‌ రకం రూ,1350, సాంబమసూరి రూ.1,550, బీపీటీ రూ.1600, హెంఎంటీ రూ.1750లకు విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న బియ్యం ధరలు మరింత పెరిగాయి. ప్రధానంగా కర్నూలు, నెల్లూరు, మాచెర్ల కారంపూడి తదితర ప్రాంతాల నుంచి బియ్యం దిగుమతి అవుతోంది.

కొత్తబియ్యమే దిక్కు..

సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు పాత బియ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వీటి లభ్యత తగ్గిపోయింది.విధిలేని పరిస్థితిలో కొత్తబియ్యాన్ని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాత, కొత్త బియ్యం ధరలను పెంచేస్తున్నారు. ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సామాన్యులు చెబుతున్నారు.

అక్రమనిల్వలపై దాడులేవి..

బియ్యం వాపారాన్ని ప్రధానంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు నియంత్రిస్తున్నారని అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమౌవుతోంది. ధాన్యాన్ని పెద్దమొత్తంలో సేకరించి జిల్లాలోని మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారని మార్కెట్‌లో సరఫరా పరిమితం చేస్తూ ధరలనుక్రమంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దోచేస్తున్నారు...

బియ్యం వ్యాపారులు, సిండికేటుగా ఏర్పడి దోచేస్తున్నారు.వారు చెప్పిందే ధరగా , చేసిందే చట్టంలా మారుతోంది.ఎక్కువ మంది పక్క జిల్లాల నుంచి దిగుమతి బియ్యాన్ని వినియోగస్తుండటంతోడిమాండ్‌ పెరిగింది. ఇదే అదునుగా చూసుకొని ధరలను పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

బియ్యంపై ఆధారపడే వ్యాపారం

బియ్యంపై ఆధారపడి జరిగే వ్యాపారంలో ధరల పెరగుల కనిపిస్తోంది. హోటళ్లలో భోజనాలు ధరలను కూడా పెరిగాయి. బియ్యంకు అనుబంధంగా ఉన్న వాటిపై ధరలను పెంచుకొని అమ్మకాలు చేస్తున్నారు. బియ్యం ధరల పెంపును సాకుగా చూపిస్తున్నారు.

బియ్యం వ్యాపారుల సిండికేట్‌

సాకుగా ఎల్‌నినో,యుద్ధాలు

నెలకో విధంగా ధరలు

అడ్డగోలుగా జనం దగ్గర నుంచి

దోచేస్తున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement