అట్లూరు : హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన ఎద్దుల ఇంద్రసేనా రెడ్డి(24) అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు కొండూరు గ్రామానికి చెందిన ఎద్దుల ప్రద్యుమ్నరెడ్డి, రుక్మిణమ్మ దంపతుల ఏకై క కుమారుడు ఇంద్రసేనారెడ్డి ఢిల్లీలో ఏరో నాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇటీవల హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో ఉద్యోగంలో చేరాడు. గురువారం రాత్రి బైక్‌లో బయటికి వెళ్లాడు. టిప్పర్, ద్విచక్రవాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడి పోలీసులు మృతుని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో బంధువులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులతోపాటు బంధువులు హైదరాబాద్‌కు వెళ్లారు.
ఉత్తమ జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌గా కడప డీసీసీ బ్యాంక్
కడప అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్(డీసీసీ బ్యాంకు) కడపకు ఏపీ రాష్ట్ర సహకారం బ్యాంకు(ఆప్కాబ్) నుంచి తొలిసారిగా ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఆప్కాబ్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 4వ తేదీ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సహకారం పరపతి వ్యవస్థ అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలు, అత్యుత్తమ పనితీరును గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతంలో ఉత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుగా కడపజిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఎంపిక చేసింది. ఇందుకుగాను బ్యాంకుకు ప్రశంసా పత్రం, జ్ఞాపికతోపాటు రూ. 1.50 లక్షల నగదు బహుమతిని పిక్‌సడ్ డిపాజిట్ రూపంలో ప్రదానం చేశారు. బ్యాంకు తరపున పి. రాజామణి ముఖ్య కార్య నిర్వాహణాధికారి(సీఈఓ) ఏపీ సహకారశాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ బాబు(ఐఏఎస్) చేతుల మీదుగా ఆప్కాబ్ చైర్మెన్ గన్ని వీరాంజనేయులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణల సమక్షంలో అవార్డును అందజేశారు. చైర్మన్‌న్‌సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం, ఉద్యోగులు, ఆనుబంధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), సహకారశాఖ అధికారుల సమష్టి కృషికి దక్కిన గౌరవమని అన్నారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చాపాడు : మండల పరిధిలోని ఖాదర్‌పల్లె సమీపంలో శుక్రవారం ఉదయం 5 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. మందస్తు సమాచారం మేరకు ఖాదర్‌పల్లె సమీపంలోని చెరువు దగ్గర ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా దాడులు నిర్వహించామన్నారు. సల్మా అనే మహిళను పట్టుకోగా జాకీర్, నావల్, హాజిల్‌లు పరారయ్యారన్నారు. సంఘటన స్థలం వద్ద రూ.2లక్షల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు


