● బాధితుడు సతీష్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు
ముద్దనూరు: వైఎస్సార్ కడప జిల్లా వేల్పుచెర్ల గ్రామానికి చెందిన కూటమి నాయకుడు చప్పిడి రామాంజనేయరెడ్డి(బాబురెడ్డి)తో తనకు ప్రాణహాని ఉందని, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాండ్లోపల్లె గ్రామానికి చెందిన చప్పిడి సతీష్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం తన తల్లి శారదాదేవితో కలిసి సీఐ నగేష్‌బాబుకు ఫిర్యాదుచేసాడు.సతీష్‌రెడ్డి పత్రికాప్రకటన మేరకు. రామంజనేయరెడ్డి ఆర్టీపీపీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.4లక్షల 50వేలు తీసుకున్నాడు.ఉద్యోగం ఇప్పించకుండా మభ్యపెట్టాడు. చివరికి తహసీల్దారు కార్యాలయంలో తాను 6నెలలు తాత్కాలిక ఉద్యోగంలో చేరానని,అది ముగిసిన తర్వాత రామాంజనేయరెడ్డిని డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడిచేశాననితెలిపాడు. జూన్ 17న రామాంజనేయరెడ్డి, భూపేష్‌రెడ్డి,రాజేష్‌రెడ్డిలతో మరో ఉద్యోగం ఇప్పిస్తానని,మరుసటి రోజు కడపలో జరిగే కూటమి సభలో పురుగులమందు తాగాలని ఒత్తిడిచేసినట్లు బాధితుడు తెలిపాడు.అయితే నాకు 2నెలల కుమారుడు ఉన్నాడని, అలా చేయనని చెప్పగా,అలా చేయకుంటే ఉద్యోగం,డబ్బు రెండూ రావని రామాంజనేయరెడ్డి చెప్పాడని తెలిపాడు.అతని బెదిరింపులకు భయపడి సభలో పురుగులమందు తాగానని,తాను చికిత్స పొందుతున్న సమయంలో ముద్దనూరుకు చెందిన కటికరెడ్డి మధసూధన్‌రెడ్డికి నేను డబ్బు ఇచ్చినట్లు రాసి సంతంకం చేయాలని రామాంజనేయరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చినట్లు,తాను అందుకు అంగీకరించలేదని బాధితుడు పేర్కొన్నాడు.అనంతరం తాను అపస్మారకస్థితిలో ఉన్నానని,తాను ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని,చప్పిడి రామాంజనేయరెడ్డివల్ల తనకు ప్రాణహాని వుందని, నాకుటుంబానికి రక్షణ కల్పించాలని,తన వద్ద తీసకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని, తనను బెదిరించినందుకు అతనిపై కేసుమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సతీష్‌రెడ్డి సీఐకి ఫిర్యాదు చేసాడు.


