ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 విజేత కడప జట్టు | - | Sakshi
Sakshi News home page

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 విజేత కడప జట్టు

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 విజేత కడప జట్టు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మెన్‌ మల్టీడే ఐదవ విడత మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్‌లో కడప జట్టు 15 పాయింట్లతో విజేతగా నిలిచింది. కర్నూలు 15, చిత్తూరు 13, నెల్లూరు 4, అనంతపురం 2 పాయింట్లు సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మూడవ రోజు 198 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 72.3 ఓవర్లకు 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని కుళ్ళాయప్ప 29 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని నిహాల్‌ మాలిక్‌ 3, తేజేష్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 22.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 101 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది. ఆ జట్టులోని సిద్దు 47 పరుగులు చేశాడు. కడప జట్టులోని ధీరజ్‌కుమార్‌రెడ్డి అద్బుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు, శివశంకర్‌ 2, వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కడప జట్టు 22 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్‌ 38, జీవీ సాయిసాకేత్‌ 56 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్‌ 2, జయంత్‌ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

అదే విధంగా కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం మూడవ రోజు 334 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 69.1 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. ఆ జట్టులోని సిద్దార్ద్‌రెడ్డి 98, లోకేష్‌ 116 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంజయ్‌ కుమార్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 87 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. ఆ జట్టులోని సందీప్‌రెడ్డి 93, ఆదినారాయణరెడ్డి 61, సంజయ్‌కుమార్‌ 69 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సిద్దార్ద్‌రెడ్డి 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

సందీప్‌రెడ్డి, అనంతపురం, 93 పరుగులు

ధీరజ్‌కుమార్‌రెడ్డి,

కడప, 5 వికెట్లు

లోకేష్‌, నెల్లూరు

116 పరుగులు

సిద్దార్ద్‌రెడ్డి, నెల్లూరు,

98 పరుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement