దేవునికడప ఆలయంలో భక్తుల రద్దీ
ఒంటిమిట్ట రామాలయంలో క్యూలైన్‌లో భక్తులు
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లావ్తాప్తంగా ప్రసిద్ధ ఆలయాలను వేకువజామునుంచే భక్తులు సందర్శించి పూజలు చేశారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామాలయం భక్తులతో కిటకిటలాడాయి. గోవింద, రామనామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. – సాక్షి నెట్‌వర్క్


