అప్పాజోస్యులకు ‘గడియారం’ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

అప్పాజోస్యులకు ‘గడియారం’ పురస్కారం

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

కడప సెవెన్‌రోడ్స్‌: చీరాలకు చెందిన ప్రముఖకవి, అజో–విభొ–కందాళం ఫౌండేషన్‌ నిర్వాహకులు, ప్రసిద్ధ కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘మహాకవి’ డాక్టర్‌ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయినట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్‌ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో జరుగుతుందన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా ఒక ఉత్తమ కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు అవార్డు, రూ.10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement