● బహుధాన్య పంటల సాగుతో రైతులకు క్లిష్ట సమయాల్లోనూ గట్టి ఆర్థిక స్వాలంబన చేకూరుతుంది.
● అప్పుడప్పుడు కురిసే అరకొర వర్షాల సహాయంతోనే.. బహుధాన్య కిట్‌లోని కంది, ఆముదం, ఆనప, జొన్న, పొద్దుతిరుగుడు, అలసంద, గోరుచిక్కుడు వంటి పంటలు సులభంగా సాగు అవుతాయి. ఈ పంటలను చివరి వరకు పొలంలో కొనసాగిస్తే రైతులకు అద్భుతమైన మార్కెట్ ఆదాయం లభిస్తుంది. మధ్యలో సాగు చేసిన పశుగ్రాసాన్ని సొంత పశువుల మేతకు వినియోగించుకున్నా, మిగతా బహుధాన్య పంటల దిగుబడి ద్వారా రైతులకు చేతినిండా అదనపు రాబడి దక్కుతుంది.


