మిట్స్‌ ప్రొఫెసర్‌కు అరుదైన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మిట్స్‌ ప్రొఫెసర్‌కు అరుదైన గుర్తింపు

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లులోని మిట్స్‌ డీమ్ట్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అలుమ్ని రిలేషన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గుత్తి నాగశ్వేత ఐఈఈఈ సీనియర్‌ మెంబర్‌ గ్రేడ్‌ సాధించి గౌరవాన్ని అందుకున్నట్లు వీసీ యువరాజ్‌ గురువారం తెలిపారు. ఇంజినీరింగ్‌, సాంకేతిక రంగాల్లో పదేళ్లకు పైగా అనుభవం, పరిశోధనల్లో చేసిన కృషి, సాంకేతిక సేవలు, నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన నైపుణ్యాలును గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్‌ గుత్తి నాగశ్వేత అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించడమే కాకుండా విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చాన్స్‌లర్‌ డాక్టర్‌ నాదేళ్ల విజయభాస్కర్‌ చౌదరి, ప్రోచాన్స్‌లర్‌ నాదేళ్ల ద్వారకనాఽథ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కీర్తి నాదేళ్ల, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి.ప్రదీప్‌కుమార్‌, ఐఈఈఈ కోఆర్డినేటర్‌ సి.కుమార్‌ అధ్యాపకులు, సిబ్బంది నాగశ్వేతను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement