కడప కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు హెచ్చరించారు. గురువారం కడప నగరం 48వ డివిజన్‌లోని ఏఎస్‌ఆర్ నగర్‌లో టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరామర్శించారు. తీవ్రంగాఈ గాయపడిన కేశవను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, దాడులు, బెదిరింపులు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కడప నగరంలో సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.ప్రజల భద్రతను కాపాడటంలో విఫలమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, ఈస్ట్ జోన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నాయకులు డా. ఓబుల్ రెడ్డి, ఎల్లారెడ్డి, రాజేష్, క్రిష్ణమాచార్యులు, క్రిష్ణ, శ్రీరాములు, మహిళా నాయకురాలు కుమారి పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా,
సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు


