ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే | - | Sakshi
Sakshi News home page

ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

కడపసెవెన్‌రోడ్స్‌ : మహాత్మా జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి నిధి మీనా పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని జిల్లా బీసీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ డాక్టర్‌ నిధి మీనా హాజరయ్యారు. గౌరవ అతిధులుగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి డైరెక్టర్‌ వడ్ల శ్రీనివాసచారి, రాష్ట్ర సగర ఉప్పర సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్‌ డైరెక్టర్‌ పేట చంద్రశేఖర్‌, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మేదర రవికుమార్‌, రాష్ట్ర వేర్‌ హౌస్‌ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ ఎం. శ్రీధర్‌, రాష్ట్ర వడ్డెర కార్పోరేషన్‌ డైరెక్టర్‌ వెంకట సుబ్బయ్య, రాష్ట్ర నూర్‌భాష అభివృద్ధి కార్పోరేషన్‌ డైరెక్టర్‌ నగూర్‌ వీరభద్రుడు, రాష్ట్ర దాసరి అభివృద్ధి సంక్షేమ కార్పోరేషన్‌ డైరెక్టర్‌ గోవింద్‌ సుబ్బయ్య, రాష్ట్ర యాదవ్‌ అభివృద్ధి కార్పోరేషన్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ యాదవ్‌తోపాటు ఇతరప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సామాన్య జీవితంతో అసాధారణంగా కృషి చేసిన మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. ‘సత్య షోడచ సమాజం’అనే సంస్థను నెలకొల్పిన ఆయన అన్ని వర్గాల వారి మధ్య అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. డీఆర్వో మల్లికార్జున మాట్లాడుతూ కుల వ్యవస్థను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా అభివృద్ధి చెందినపుడే సాధ్యమవుతుందన్నారు. వీటన్నింటినీ అధిగమించాలంటే ఒక్క విద్య వల్లనే సాధ్యం అవుతుందని అనుభవ పూర్వకంగా గ్రహించిన అధ్యయనకర్త జ్యోతిరావు పూలే అన్నారు. ఎస్డీసీ వెంకటపతి మాట్లాడారు. అంతకుముందు మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి ముఖ్య అతిధులు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత బస్టాండు వద్ద పూలే సర్కిల్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జున, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

జేసీ డాక్టర్‌ నిధి మీనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement