కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడప లోని మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదోతరగతి మూల్యాంకన కేంద్రాన్ని ఆయన శనివారం డీఈఓ షేక్ షంషుద్దీన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మూల్యాంకన కేంద్రంలో ఇచ్చిన ట్యాబ్‌లకు సంబంధించిన సర్వర్ సరిగా పనిచేయకపోవడం వల్ల మార్కులు అప్‌లోడ్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సర్వర్ కెపాసిటీ పెంచాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే కొత్త పీఆర్సీ కమిటీ, ఐఆర్‌తోపాటు డీఏలను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నాడు–నేడు పనులతో పాఠశాలు ఎంతగానో అభివృద్ధి చెందాయాన్నారు. వైఎస్సార్‌టిఎఏ నాయకులు అమర్‌నాథరెడ్డి, రమణారెడ్డి, కిరన్‌కుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, శంకర్‌రెడ్డి, జీవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన
ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి


