ప్రొద్దుటూరు క్రైం : డివైడర్‌ను ఢీకొని కారు టైరు పగిలిన ఘటన కొర్రపాడు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇందిరానగర్‌కు చెందిన ఒక వ్యక్తి కారులో కొర్రపాడు రోడ్డులో వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఓ మహిళ అడ్డం వచ్చింది. డ్రైవర్ ఆమెను తప్పించే క్రమంలో కారు డివైడర్ దిమ్మెను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ముందు భాగం టైరు పగలడంతో కారు రోడ్డుకు అడ్డంగా తిరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోవడంతోపాటు కొంత భాగం దెబ్బతింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొద్ది సేపు ఘటనా స్థలంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ ఎస్‌ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుళ్లతో కలిసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
కరెంటు షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : పండుగ పూట చేనేత కార్మికుడు కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయ పడ్డాడు. మదనపల్లెలో గురువారం జరిగిన ఘటనకు సంబంధించి జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్‌లో ఉంటున్న బి.రఘునాథ్(40) మగ్గాలు నేసుకొని కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలో ఉన్న మునగ చెట్టెక్కి మునగ కాయలు కోసేందుకు బుధవారం రాత్రి వెళ్లాడు. కాయలు కోసే క్రమంలో చెట్టు కొమ్మ విరిగి పక్కనే వెళుతున్న విద్చుత్ వైర్ల మీద పడి కరెంటు షాక్‌కు గురయ్యాడు. కుటుంబీకులు గమనించి తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు.
డివైడర్‌ను ఢీకొని పగిలిన టైరు


