వన్డే మ్యాచ్‌లో కర్నూలు, నెల్లూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

వన్డే మ్యాచ్‌లో కర్నూలు, నెల్లూరు జట్ల విజయం

Mar 20 2026 8:11 AM | Updated on Mar 20 2026 8:11 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ సీనియర్స్‌ మెన్‌ అంతర్‌ జిల్లాల వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు కొనసాగాయి. గురువారం కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో కర్నూలు–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 24,4 ఓవర్లకు 110 పరుగులకు ఆలౌట్‌ అయింది. పూర్య 61, సూర్య చరణ్‌ 18 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సుదర్శన్‌రెడ్డి 4, ఆంజనేయులు 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 14.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆ జట్టులోని కరణ్‌ షిండే 46, ఎంఎస్‌ గిరినాథ్‌ 21 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మాధవ్‌ రాయుడు 2 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కడప–నెల్లూరు జట్లు పోటీపడ్డాయి. టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కడప జట్టు 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధనుష్‌ 102 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. షేక్‌ జహీర్‌ అబ్బాస్‌ 44 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సాకేత్‌ రామ్‌ 2, తోషిత్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్‌రెడ్డి 122, సయ్యద్‌ పర్హాద్‌ ఖద్రీ 48 పరుగులు చేశారు. కడప జట్టులోని పఠాన్‌ షరీఫ్‌, ఆరిఫ్‌ బాషా, జహీర్‌ అబ్బాస్‌ తల ఒక వికెట్‌ తీశారు. దీంతో నెల్లూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సూర్య, చిత్తూరు

(63 పరుగులు)

సుదర్శన్‌రెడ్డి, కర్నూలు (4 వికెట్లు)

ధనుష్‌, కడప

(127 పరుగులు)

నిఖిలేశ్వర్‌రెడ్డి, నెల్లూరు (122 పరుగులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement