ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జరగబోవు రథోత్సవానికి ఒంటిమిట్ట రామయ్య రథం నూతన రంగులతో మెరుగులు దిద్దుకుంటుంది. టీటీడీ సివిల్ విభాగం అధికారులు రథోత్సవానికి ఒంటిమిట్ట రథాన్ని పూర్తి స్థాయిలో దృఢంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతలో గుత్తేదారుడు కట్టా సుబ్బరాయుడు రాజీ పడకుంగా శరవేగంగా పూర్తి చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. రథోత్సవానికి ముందే ఒంటిమిట్ట రథాన్ని అన్ని విధాలా సిద్ధం చేసి ఉంచాలని టీటీడీ సివిల్ విభాగం అధికారులు గుత్తేదారుడిని ఆదేశించారు.


