ఎంబీఏ మార్కెటింగ్‌లో ప్రథమ బహుమతి అందుకుంటున్న
కేఎస్‌ఆర్‌ఎం కళాశాల విద్యార్థి లిఖిత అండ్ టీమ్
యంగ్ మేనేజర్ టైటిల్‌ను అందుకున్న కేఎల్‌ఎం ఇంజినీరింగ్ విద్యార్థి ఆప్రిన్
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజీలోని బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా లెవల్ మేనేజ్‌మెంట్ మీట్ ‘వేమన మంథన్ 2కె26’ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ పి.సరిత కన్వీనర్‌గా వ్యవహరించగా.. ముఖ్య అతిథిగా విచ్చేసిన రెయిన్‌బో ఆగ్రో–వెట్ సెరీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.వి.సుబ్బారాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధునిక వ్యాపార ప్రపంచంలో విజయం సాధించాలంటే నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతతోపాటు వినూత్న ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ మేనేజ్‌మెంట్ మీట్‌లో కె.ఎస్.ఆర్.ఎం కళాశాల, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు), పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఆర్.జి.ఎం కళాశాల, అన్నమాచార్య పీజీ కళాశాలలు, శ్రీహరి డిగ్రీ కళాశాల, శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల, నారాయణ కళాశాల, ఇతర విద్యాసంస్థల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని వివిధ పోటీల్లో తమ ప్రతిభ చాటారు. ఈ ముగింపు వేడుకల్లో డీన్ (కామర్స్, లా మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ) ప్రొఫెసర్ వై.సుబ్బారాయుడు, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులు డాక్టర్ బి.గంగయ్య, డాక్టర్ పి.వి.వరప్రభాకర్, డాక్టర్ ఎస్.వి. సుబ్బారెడ్డి, డాక్టర్ ఎస్.సుబ్బారెడ్డి, డాక్టర్ ఎ.అమృత ప్రసాద్‌రెడ్డితోపాటు అకడమిక్ కన్సల్టెంట్లు టి.అనిల్ దేవకుమార్, పి.రాజశేఖర్, వి.వెంకట రమణయ్య, పి.సుధీర్ కుమార్, ఎస్.కె. అబ్దుల్ గఫార్ తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
యంగ్ మేనేజర్ :
బి.ఆఫ్రీన్ (కె.ఎల్.ఎం కళాశాల) విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఎంబీఏ – హెచ్‌ఆర్ విభాగం :
ప్రథమ బహుమతి : బి.లిఖిత, జి.దివ్యసాయి, పి.సుకన్య – కె.ఎస్.ఆర్.ఎం కళాశాల
ద్వితీయ బహుమతి : డి.దివ్య, బి.నిఖిత, ఎస్.లావణ్య – విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు
తృతీయ బహుమతి : కె.అక్షయ్ సంజీవ్, ఐ.మధు నాయక్ – పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ
బీబీఏ – హెచ్‌ఆర్ విభాగం
ప్రథమ బహుమతి : ఎస్.విష్ణుప్రణీత, వి.సాయి నిత్య, ఎం.హర్షిత – విశ్వం డిగ్రీ కళాశాల
ద్వితీయ బహుమతి: ఎం.డి.ఫసియుద్దీన్, ఎస్.సంతోష్, సుయాష్ రాజ్ సింగ్ – శ్రీహరి డిగ్రీ కళాశాల, కడప
తృతీయ బహుమతి : ఎస్.మెహక్, ఎస్.ఐమాన్ ఫరిసా, ఇ.పద్మావతి – శ్రీహరి డిగ్రీ కళాశాల, కడప
ఎంబీఏ – మార్కెటింగ్ (మాయ ) :
ప్రథమ బహుమతి : ఎస్.లిఖిత, ఎస్.సాధకున్, ఎం.అనుష – కేఎల్‌ఎం కళాశాల
ద్వితీయ బహుమతి : ఎస్.ఎం.డి. షారుఫుద్దీన్, డి.నాసర్ మొహమ్మద్, డి.మనోజ్ కుమార్ – ఆర్.జి.ఎం కళాశాల
తృతీయ బహుమతి : ఎల్.వర్షిత కావ్య, టి.కవిత, ఎస్.రేష్మ – అన్నమాచార్య పీజీ కళాశాలలు
బీబీఏ – మార్కెటింగ్ (మాయ):
ప్రథమ బహుమతి : ఎస్.అర్షియా, సి.హర్ష గోపాల్, ఎం.విశాల్ – శ్రీహరి డిగ్రీ కళాశాల
ద్వితీయ బహుమతి : ఓ.స్టాలిన్, జి.తేజదీప్ కుమార్, బి.జితేష్ – శ్రీరామకష్ణ డిగ్రీ కళాశాల
తృతీయ బహుమతి : ఎస్.రెహాన్, ఎన్.ముజుద్దీన్, ఎస్.అబ్దుల్ రెహమాన్ – శ్రీహరి డిగ్రీ కళాశాల
ఎంబీఏ – ఫైనాన్స్ (అర్థ ):
ప్రథమ బహుమతి : త్రినాధత్ అండ్ టీమ్ – నారాయణ ఇంజినీరింగ్ కళాశాల
ద్వితీయ బహుమతి: నంద కిషోర్ – టీమ్ – పాండిచ్చేరి యూనివర్సిటీ
తృతీయ బహుమతి : శివాని – టీమ్ – కె.ఎస్.ఆర్.ఎం కళాశాల
బీబీఏ– ఫైనాన్స్ (అర్థ ):
ప్రథమ బహుమతి: ప్రదీప్ – టీమ్ – శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల


