రాజగోపాల్‌రెడ్డి మల్లికార్జునరెడ్డి గురుమోహన్ కె. నాగేంద్రారెడ్డి ఆర్.వెంకట సుబ్బారెడ్డి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వు లు జారీ చేసింది. మైదుకూరు అసెంబ్లీ ని యోజకవర్గానికి వంకమళ్ల రాజగోపాల్‌రెడ్డి, బద్వేల్‌కు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, కడపకు సింగసాని గురుమోహన్, పులివెందులకు కల్లూరు నాగేంద్రారెడ్డి, కమలాపురం రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ప్రొ ద్దుటూరుకు పూల శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగుకు పోరెడ్డి నరసింహారెడ్డిలను నియమించారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిశీలకుడిగా మాసీమ బాబు
కడప కార్పొరేషన్ : నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడిగా మాసీమబాబును నియ మిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మాసీమ బాబు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్నారు.
పి. నరసింహారెడ్డి పోల శ్రీనివాసరెడ్డి మాసీమ బాబు


