గల్ఫ్‌లో ఉన్న ప్రవాసాంధ్రులు అందరూ క్షేమం | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసాంధ్రులు అందరూ క్షేమం

Mar 5 2026 7:34 AM | Updated on Mar 5 2026 7:34 AM

గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాస్‌ బి.హెచ్‌.

కడప కార్పొరేషన్‌: గల్ఫ్‌ దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులంతా క్షేమంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాస్‌ బీహెచ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం కువైట్‌, సౌదీ, ఖతార్‌, దుబాయ్‌, బహరైన్‌, ఒమన్‌ పర్యటనలో ఉన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గల్ఫ్‌ ( జీసీసీ ) లో మన భారతదేశానికి సంబంధించిన పౌరులు సుమారు 95 లక్షల పైగా ఉన్నారని, తెలుగువారు సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారన్నారన్నారు. అందులో ఎక్కువ శాతం వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, ఉభయ గోదావరి జిల్లా వాసులు ఉన్నారన్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్రులను అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి పిలుచుకొని రావాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌హన్‌ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఇదివరకే విజప్తి చేశారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్‌ కన్వీనర్‌ సాంబశివారెడ్డి, గల్ఫ్‌లో ఉన్న పార్టీ నాయకులతో ప్రతిరోజూ మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారన్నారు. కేంద్ర విదేశాంగ శాఖామంత్రితో కడప, రాజంపేట ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పి. మిథున్‌రెడ్డిలు ఈ విషయమై మాట్లాడుతున్నారన్నారు. బహరైన్‌ కన్వీనర్‌ ఓర్సు నాగరాజు, తాను కూడా యుద్ధం వల్ల బహరైన్‌లో ఇరుక్కుపోవాల్సి వచ్చిందన్నారు. గల్ఫ్‌లో అన్ని దేశాల ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయ అధికారులు, గల్ఫ్‌లోని మన సామాజిక సేవా సంస్థలు కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. యుద్ధానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో దయచేసి పోస్ట్‌ చేయవద్దని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement