నేడు ప్రొద్దుటూరుకు వైఎస్‌ జగన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రొద్దుటూరుకు వైఎస్‌ జగన్‌ రాక

Mar 5 2026 7:34 AM | Updated on Mar 5 2026 7:34 AM

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుమార్తె రిసెప్షన్‌కు హాజరు

వధూవరులను ఆశీర్వదించనున్న జగన్‌

ప్రొద్దుటూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం ప్రొద్దుటూరుకు రానున్నారు. రామేశ్వరం బైపాస్‌ రోడ్డులోని వైవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్‌ రెడ్డి రిసెప్షన్‌ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వైఎస్‌ జగన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 11.10 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. హెలీప్యాడ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలను కలుసుకున్న అనంతరం రోడ్డు మార్గం ద్వారా వేదిక వద్దకు వెళ్తారు. దారి పొడవునా భద్రత ఏర్పాట్లను ఏఎస్పీ విభూ కృష్ణ పరిశీలించారు. ముందు జాగ్రత్తగా చర్యగా పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

నల్గొండ గద్దర్‌ నరసన్న రాక

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్‌ రెడ్డిల వివాహం గత నెల 26న హైదరాబాద్‌లో జరిగింది. గురువారం ప్రొద్దుటూరులో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరానున్నారు. కాగా రిసెప్షన్‌ కార్యక్రుమానికి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆహ్వానం మేరకు నల్గొండ గద్దర్‌ నరసన్న రానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన పాటలు పాడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement