విద్యార్థులకు సకాలంలో సమాచారం చేరాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సకాలంలో సమాచారం చేరాలి

Mar 5 2026 7:34 AM | Updated on Mar 5 2026 7:34 AM

కడప ఎడ్యుకేషన్‌: కాన్వకేషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు సమాచారం చేరవేతలో జాప్యం చోటు చేసుకోకూడదని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ అన్నారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఆయన కాన్వకేషన్‌ కోర్‌ కమిటీ, నిర్వాహక కమిటీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాన్వకేషన్‌ నిర్వహణ రోజున ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, ఎన్‌సీసీ క్యాడెట్ల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆహ్వాన పత్రాల ఎంపిక, పంపిణీ విద్యార్థి విషయాలపై చర్చించారు. రాష్ట్ర గవర్నర్‌ రానున్న దృష్ట్యా విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పద్మ, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌వీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement