రసవత్తరంగా వాలీబాల్ పోటీలు
జమ్మలమడుగు : జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గురువారం 16 టీంలు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఉదయం పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన మ్యాచ్‌లో 3–0తో పశ్చిమబెంగాల్, రాజస్థాన్–కేరళ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలుపొందాయి.హర్యానా పంజాబ్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది, 3–1తో హర్యానా గెలుపొందింది , తమిళనాడు మహారాష్ట్రల మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు మహారాష్ట్ర జట్టున చిత్తుగా ఓడించింది.శుక్రవారం ఉదయం సెమీఫైనల్ పశ్చిమబెంగాల్ రాజస్థాన్, హర్యానా, తమిళనాడు మధ్య జరగనుంది.ఇందులో గెలుపొందిన జట్లు ఫైనల్లో ఢీకొంటాయి.గెలుపొందిన జట్లుకు సాయంత్రం షీల్డ్ అందజేస్తారని ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రసాద్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి తెలిపారు.
ఎరువుల దుకాణాల తనిఖీ
తొండూరు : మండల కేంద్రమైన తొండూరులోని ఎరువుల దుకాణాలను గురువారం ముద్దనూరు వ్యవసాయ శాఖ ఏడీ రామ్మోహన్‌రెడ్డి ఏఓ రాజుతో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న స్టాకు రిజిస్తర్, బిల్లు బుక్, లైసెన్స్‌లను పరిశీలించారు. నాగమణి ఫర్టిలైజర్ షాపులో ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు లేకుండా అమ్ముతున్న పురుగు మందులు, స్టాకు రిజిస్టర్ అప్‌డేట్ చేయకపోవడం వంటి కారణాలతో 21 రోజుల వరకు సుమారు రూ.1,86, 630ల విలువ గల పురుగు మందుల స్టాకు అమ్మకాలను నిలుపుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 21వ రోజైన గురువారం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు.
10న ఫొటోగ్రాఫర్లకు
ఉచిత ఏఐ వర్క్‌షాప్
కడప సెవెన్‌రోడ్స్ : ప్రముఖ ఫొటోగ్రఫీ నిపుణులు గోపికృష్ణారెడ్డి, మరీదు హరిబాబుల ఆద్వర్యంలో ఈనెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఫొటోగ్రాఫర్లకు ఉచిత ఏఐ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫొటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కో చైర్మన్ పద్మప్రియ చంద్రారెడ్డి తెలిపారు. కడప పాత రిమ్స్‌లోని బీసీ భవన్‌లో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌ను ఫొటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి కడప నగర అసోసియేషన్ ప్రెసిడెంట్ నిమ్మనబోయిన ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ, సెక్రటరీ షేక్షావలి, ట్రెజరర్ సుబ్బారెడ్డి జాయింట్ సెక్రెటరీ శబరి పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు.
బొలెరో, బైక్ ఢీ:
రియల్టర్ మృతి
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో రియల్టర్ మృతి చెందిన విచారకర సంఘటన కురబలకోట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మదనపల్లి రూరల్ మండలం సీటీఎం సోమలగడ్డకు చెందిన రెడ్డెప్ప (52) పరిసర ప్రాంతాల్లో రియల్టర్‌గా కొ నసాగుతున్నారు. ఇతను భవన నిర్మాణ పనులు చేపట్టాడు. గురువారం సాయంత్రం టైల్స్ కోసం మదనపల్లి దగ్గరున్న అమ్మచెరువు మిట్ట వద్దకు వెళ్లాడు. అనంతరం ద్విచక్రవాహనంలో మదనపల్లె హైవేపై అవతలి రోడ్డుపైకి వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తుండడంతో ఆపాడు. దీంతో హైవేపై వెనుకగా వచ్చిన బొలెరో వాహనం ఇతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ రవి నాయక్ సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు.
రసవత్తరంగా వాలీబాల్ పోటీలు
రసవత్తరంగా వాలీబాల్ పోటీలు


