రామసముద్రంలో వైభవంగా ఇస్తిమా
రామసముద్రం : మండల కేంద్రంలో బుధ, గురువారాల్లో నిర్వహించిన ఇస్తిమా వేడుకలు వైభవంగా జరి గాయి. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. భక్తు లకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం, పరోపకారం, ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో జీవనం సాగించాలని ప్రార్థనలు చేశారు. మత పె ద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ ఉమా మాహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


