పెండింగ్ ఆర్‌ఓబీ పనులపై దృష్టి సారించాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి) పనులపై దృష్టి సారించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధానంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులతోపాటు ఆరోగ్యం (ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు), ఎండోమెంట్స్ (దేవాలయాల వద్ద సౌకర్యాలు), రెవెన్యూ (ఆర్‌ఓఆర్ సర్వే), రెవెన్యూ (ఎఫ్.లైన్ సర్వే), వ్యవసాయం (యూరియా లభ్యత), వరి సేకరణ, వాహన పోర్టల్ సేవలు, రవాణా శాఖ (ట్యాక్స్), సారథి పోర్టల్ సేవలు, ఫైర్ ఎన్‌ఓసీ తదితర అంశాలపై సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితోపాటు రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు చంద్ర మోహన్, సాయి శ్రీ,జాన్ ఐర్విన్, చెన్నయ్య, సీపీవో హజరతయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో రాజంపేట సబ్ కలెక్టర్ భావనతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో షేక్ .షంషుద్దీన్, ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


