ఐటీఐ ఉత్తీర్ణలైన విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశం
కడప ఎడ్యుకేషన్: ఐటీఐలలో 2 ఏళ్ల కాల వ్యవధిలో గల కోర్సులలో 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లో 2 సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశం పొందుటకు బ్రిడ్జి కోర్సులో అడ్మిషన్ పొందాలని ప్రభుత్వ మైనార్టీల ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ బోర్డు వారు నిర్వహించు ప్రవేశ పరీక్షలు రాయుటకు అర్హలని ఆయన పేర్కొన్నారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమకు దగ్గరలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల వద్దకు వెళ్లి సంప్రదించి వారి వివరాలను నమోదు చేసుకుని జనవరి 5వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరిగే తరగతులకు హాజరు కావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ వద్దకు వెళ్లి సంప్రదించాలని వివరించారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో బాగా పని చేసిన ఉపాధ్యాయులకు 3వ తేదీ సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం కడప ఏపీసీ కార్యాలయంలో కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భవనంలో 3వ తేదీ కేజీబీవీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేజీబీవీల అభివృద్ధి కోసం క్రమశిక్షణగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దార్ల రూత్ ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 3 నుంచి 11 వరకు చేసుకోవచ్చని వివరించారు.
పోస్టుల వివరాలు ఇలా..
టైపు–3 కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు –3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు –7, ఏఎన్‌ఎమ్ –7, అకౌంటెంట్–2, అటెండర్–4, అసిస్టెంట్ కుక్– 5, డే వాచ్ ఉమెన్–1, నైట్ వాచ్ ఉమెన్–2, స్కావెంజర్–1 అలాగే టైపు–4 కేజీబీవీల్లో వార్డెన్–1, పార్ట్ టైం టీచర్స్–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను అర్హతకు సంబంధించిన ఆధారాలతో కడపలోని సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో పని దినాలలో సమర్పించవలెనని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://www. ssa kadapa.com/2, http: //kadapa deo.in/2 సంప్రదించాలని వివరించారు.


