● ఆదాయం కోసం అడ్డదారులు | - | Sakshi
Sakshi News home page

● ఆదాయం కోసం అడ్డదారులు

Jan 3 2026 7:07 AM | Updated on Jan 3 2026 7:07 AM

● ఆదా

● ఆదాయం కోసం అడ్డదారులు

● ఆదాయం కోసం అడ్డదారులు ● హేతుబద్ధంగా లేని అంచనాలు

సాక్షి ప్రతినిధి, కడప: ఆదాయ మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో తప్పేమీ లేదు. వక్రమార్గాల ద్వారా అధిక ఆదాయం గడించాలన్నది ఆక్షేపణనీయం. ఆ దిశగా సీఎం చంద్రబాబు సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఇందుకు వాణిజ్య పన్నులశాఖ రంగంలోకి దింపింది. పెద్దల మెప్పు కోసం అధికారుల ఒంటెత్తు పోకడలతో అనేక మంది ఆవేదన చెందుతున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కడప నగరంలో హోటళ్లపై లక్షలాది రూపాయాలు జరిమానాలు విధిస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో యాజమానులు బెంబేలెత్తుతున్నారు.

● కడప నగరంలో వారం రోజులుగా జీఎస్‌టీ చెల్లింపులల్లో తేడాలున్నాయని అధికారులు హోటళ్లపై దాడులు చేస్తున్నారు. అయితే అధికారుల దర్యాప్తు, ఆపై జరిమానా విఽధింపు వ్యవహారంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆయా హోటళ్ల నుంచి జీఎస్టీ చెల్లింపులున్నాయి. కాగా, ఇటీవల హోటళ్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో దాడులు చేసి అప్పటికి రికార్డు అయిన విక్రయాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా సాయంత్రం కూడా అదే స్థాయిలో విక్రయాలు జమ అవుతాయని అంచనాకు వస్తూ చెల్లించిన జీఎస్‌టీ మొత్తం చాలా తక్కువగా ఉందని, జరిమానా ఇంత మొత్తం చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఓ హోటల్‌కు ఏకంగా రూ.20లక్షలు జరిమానా విధించారు. అలాగే బైపాస్‌లో ఉన్న మరో హోటల్‌కు రూ.8లక్షలు, కృష్ణా సర్కిల్‌లో ఉన్న ఇంకో హోటల్‌కు రూ.14లక్షలు, బస్టాండ్‌– రైల్వేస్టేషన్‌ మార్గంలో ఉన్న మరో హోటల్‌కు రూ.8లక్షలు జరిమానా విధించినట్లు సమాచారం. ఇవి చెప్పుకునేందుకు కొన్ని మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. కాగా, జీఎస్టీ చెల్లిస్తున్నా జరిమానా విధించడంపై హోటళ్ల యాజమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

హోటల్‌ వ్యాపారం సాధారణంగా మధ్యాహ్నం పూట ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో నమోదైన వ్యాపారాన్ని అంచనా వేసి లెక్క కట్టడం, జీఎస్‌టీ చెల్లింపులపై నిర్ధారణకు రావడంపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ముందే అత్తెసరు వ్యాపారాలతో ఇబ్బంది పడుతుంటే, ఆపై ఇష్టారాజ్యంగా జరిమానాలు విధిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పైగా ఆదివారం, శుక్రవారం రోజుల్లో తనిఖీలు చేస్తూ ఆయా రోజుల ఆధారంగా అంచనాలు సిద్ధం చేస్తూ జరిమానాలు విధించడంపై తీవ్ర ఆక్షేపణలు వెల్లువెత్తున్నాయి. అంతేకాకుండా 2021 నుంచి 2025 వరకూ లెక్కలు కట్టడం మరోవింతగా హోటల్‌ యాజమాన్యాలు వాపోతున్నాయి.

జీఎస్‌టీ పేరుతో భారీగా జరిమానాలు

ఐదేళ్లు జీఎస్‌టీ చెల్లించాలంటూ ఒత్తిడి

హేతుబద్ధంగా లేని అంచనాలు

బెంబేలెత్తుతున్న యాజమానులు

● ఆదాయం కోసం అడ్డదారులు 1
1/1

● ఆదాయం కోసం అడ్డదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement