● తాగుబోతుల లోకం
● ఆటో.. ఇటో.. ఎటో..
కడప నగరంలో రోజురోజుకు ఆటోల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పాత బస్టాండ్, చెన్నూరు బస్టాండ్, వైవీ స్ట్రీట్, కృష్ణాసర్కిల్, సంధ్య సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్, అప్సర సర్కిల్, బిల్టప్, ఐటీఐ వద్ద ట్రాఫిక్ సమస్య ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో ప్రజలు సమయానికి గమ్యం చేరలేక పోతున్నారు. ట్రాఫిక్ సమస్యపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.
రాష్ట్రంలో నాణ్యమైన మందు పేరిట కల్తీ మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా బార్లు, మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యానికి బానిసలుగా మారుతున్న వారు అధికమవుతున్నారు. ఫలితంగా వారిపై ఆధారపడిన కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం కావాలి. అంతే తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైనా పట్టదు. దీంతో మందు బాబులు ఎక్కడ పడితే అక్కడ తప్ప తాగి రోడ్లపై పడిపోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప
● తాగుబోతుల లోకం
● తాగుబోతుల లోకం
● తాగుబోతుల లోకం


