ఉపాధి హామీ పథకానికి తూట్లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే పద్ధతిలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.వేణుగోపాల్ విమర్శించారు. సీపీఐ వందేళ్ల వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రామరాజుపల్లెలో సీపీఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకై క పార్టీ సీపీఐ అన్నా రు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారన్నారు. ఇలాంటి మహానుభావులను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండి పడ్డారు. దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ సంపదనంతా అంబానీ, అదాని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు.


