షూటింగ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు తృతీయ స్థానం
మదనపల్లె సిటీ : రాష్ట్ర సీనియర్ షూటింగ్‌బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈనెల 25 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంది. మహిళల విభాగంలో 19 జట్లు పాల్గొన్నాయి, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో అన్నమయ్య జిల్లా జట్టు కాకినాడ జట్టు తలపడ్డాయి. 21–15 స్కోరుతో మూడవ స్థానం దక్కించుకున్నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. పురుషుల జట్టు కూడా సెమీఫైనల్స్ చేరుకుని కృష్ణ, పల్నాడు జిల్లాల జట్లుతో ఆడి నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాకారులను జట్టు కోచ్ యూసఫ్, మేనేజర్ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్‌బాబు, సభ్యులు రెడ్డి శ్రీనివాస్, భారతి, సురేష్ తదితరులు అభినందించారు.


