జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప మహిళలు జిల్లాను ప్రపంచ ఖ్యాతికి ఎక్కించారు. ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రతిభ చాటింది. దేశానికి కప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె బాటలోనే మరో విద్యార్థిని గుర్రాల హరిణి ముందుకు వెళుతోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్‌జీఎఫ్ క్రికెట్ పోటీల్లో సత్తాచాటింది. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన గుర్రాల హరి, అరుణ దంపతుల కుమార్తె హరిణి పదో తరగతి వరకు చెమ్ముమియ్యాపేటలోని గంగా భవాని బాలికల హైస్కూల్‌లో చదివింది. ఇంటర్మీడియట్ కడప నగరంలోని శ్రీహరి జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆల్ రౌండర్ అయిన గుర్రాల హరిణి ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి అండర్–17 ఎస్‌జీఎఫ్ క్రికెట్ పోటీల్లో కడప జట్టు తరుపున ఆడి సత్తా చాటింది. శ్రీకాకుళం జట్టుపైన 22 బంతులకు 57 పరుగులు చేసి 3 వికెట్లు తీసింది. అటు బ్యాటింగ్‌లోను, ఇటు ఫాస్ట్ బౌలింగ్‌లోను రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలో సత్తా చాటి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.
కడపలో ‘శంబాల’
యూనిట్ సందడి
కడప కార్పొరేషన్ : కడప నగరంలో ‘శంబాల’ యూనిట్ సందడి చేసింది. ఆ సినిమా హీరో, హీరోయిన్లు ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, సినీనటుడు సాయికుమార్‌లు ఎస్‌ఆర్ థియేటర్‌కు వచ్చారు. వారికి రాక్‌స్టార్ ఆది యువసేన సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్. యూనుస్ బాషా ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు థియేటర్ వద్ద అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్‌లో నిర్వహించిన మీట్‌లో వారు మాట్లాడుతూ కడపకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, కడప ప్రజలు చాలా మంచి వారని కొనియాడారు. ‘శంబాల’ సినిమా అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందని, అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ ఎస్‌ఎండీ షఫీ, బీజేపీ యువనాయకుడు పనతల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక


