ప్రీ క్వార్టర్ ఫైనల్ విజేత సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. ఆంధ్రా జట్టు బ్యాట్స్‌మన్ హానీష్ రెడ్డి 245 (డబుల్ సెంచరీ) చేశాడు. మిగతా బ్యాటర్లు చతికిల పడి బ్యాటింగ్‌లో రాణించలేకపోయారు. నాలుగో రోజు సౌరాష్ట్ర జట్టు 452 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. నిర్ణీత 118.5 ఓవర్లకు 483 పరుగులు చేసింది. ఆ జట్టులోని వాత్సల్ పటేల్ 62 పరుగులు చేశాడు. 522 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత ఓవర్లకు 488 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. హానీష్ వీరారెడ్డి 206 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 245 పరుగులు (డబుల్ సెంచరీ) చేశాడు. ఆనంద్ జోష్ 50 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర జట్టులోని పుష్పరాజ్ జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, మోహిత్ ఉల్వా 2 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది, ఆంధ్రా జట్టులో బ్యాటింగ్‌లో రాణించి 245 పరుగులు చేసిన హానీష్ వీరారెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ అందజేశారు.
విజృంభించిన ఆంధ్రా బౌలర్లు
ప్రీ క్వార్టర్ ఫైనల్ విజేత సౌరాష్ట్ర జట్టు
ప్రీ క్వార్టర్ ఫైనల్ విజేత సౌరాష్ట్ర జట్టు


