ఆ ఒక్కరు సెలవు పెడితే! | - | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కరు సెలవు పెడితే!

Aug 20 2025 5:22 AM | Updated on Aug 20 2025 5:22 AM

ఆ ఒక్

ఆ ఒక్కరు సెలవు పెడితే!

ఆ ఒక్కరు సెలవు పెడితే! ● పర్యవేక్షణ కరువే...

20 మందికి ఒక్కరు..

ప్రాథమిక విద్యలో వెనక‘బడి’..

కడప ఎడ్యుకేషన్‌: విద్యార్థి దశలో ప్రాథమిక విద్య ఎంతో కీలకం. ఇక్కడ బలమైన పునాది పడితేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. అలాంటి ప్రాథమి క విద్యపై కూటమి సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభు త్వ విద్యను నీరుగార్చి ప్రైవేటు విద్యారంగానికి ప్రయోజనం కలిగే లా చర్యలు తీసుకుంటోందన్న విమర్శ ఉంది. ఇప్పటికే పిల్లలు లేక జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలు మూతపడగా.. ప్రస్తుతం జిల్లాలోని 701 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు సేవలందిస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సెలవు పెడితే విద్యార్థుల చదువులు అటకెక్కే పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాథమిక పాఠశాల వివరాలు ఇలా...

జిల్లావ్యాప్తంగా 1659 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 48,461 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో 701 స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ స్కూళ్ల నిర్వహణతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్‌, తెలుగు, లెక్కలు ఇలా అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది.ఈ పరిస్థితి చూస్తే ప్రభుత్వ బడుల్లో చదువెలా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేధావులు చెబుతున్నారు.

మండలాల వారీగా ఏకోపాధ్యాయ పాఠశాలలు

జిల్లావ్యాప్తంగా 701 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మండలాల వారీగా అట్లూరులో 19, బి.కోడూరులో 17, బి.మఠంలో 19, బద్వేల్‌లో 31, సీకేదిన్నెలో 14, చక్రాయపేటలో 32, చాపాడులో 28, చెన్నూరులో 16, కడపలో 15, దువ్వూరులో 19, గోపవరంలో 20, జమ్మలమడుగులో 14, కలసపాడులో 16, కమలాపురంలో 28, ఖాజీపేటలో 32, కొండాపురంలో 18, లింగాలలో 10, ముద్దనూరులో 18, మైదు కూరులో 35, మైలవరంలో 27, పెద్దముడియంలో 13, పెండ్లిమర్రిలో 28, పోరుమామిళ్లలో 22, ప్రొద్దుటూరులో 22, పులివెందుల్లో 9, రాజుపాలెంలో 15, కాశినాయనలో 10, సిద్దవటంలో 18, సింహాద్రిపురంలో 20, తొండూరులో 17, వీఎన్‌పల్లిలో 19, వల్లూరులో 24, వేంపల్లిలో 11, వేములలో 13, ఒంటిమిట్టలో 9, ఎర్రగుంట్లలో 21 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

పిల్లల చదువేం కావాలి..

జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏదైనా అత్యవసర పనుల మీద సెలవు పెడితే.. విద్యార్థుల చదువు పరిస్థితేందటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు సమీపంలోని స్కూల్‌ నుంచి డిప్యూటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించేవారు. ఇప్పుడా పరిస్థితి కూడా లేనట్లు తెలిసింది. దీంతో అయ్యవారు సెలవు పెడితే విద్యార్థులకు కూడా అప్రకటిత సెలవు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. లేదంలే ఎమ్మార్సీ పరిధిలో పనిచేసే సీఆర్‌పీలు అక్కడికి వెళ్లి పాఠశాలలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా జరగడం వల్ల విద్యార్థులకు ప్రాథమిక విద్య బోధన కుంటుపడక తప్పదని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలకు రెగ్యులర్‌ టీచర్‌ సెలవు పెట్టినప్పుడు వేరొక టీచర్‌ బోధించడం తరువాత మరోక టీచర్‌ బోధించడం వంటి సమస్యలతో పిల్లలకు కొంతమేర ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మందికి ఒక ఉపాధ్యాయులు ఉండాలి. 20 మంది విద్యార్థులు దాటితే ఒక హెచ్‌ఓంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకే ఉపాధ్యాయుడు ఉండటం వల్ల బోధనలు కష్టతరంగా మారనుంది, అటు బోధన, ఇటు పర్యవేక్షణ చేయడం ఇబ్బందికరంగా మారుతోందని ఏకోపాధ్యాయులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏకోపాధ్యాయ పాఠశాలల పట్ల స్పందించా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

1 నుంచి 5వ తరగతుల వరకు ఒక్కరే బోధన

కూటమి అడ్డగోలు నిర్ణయాలతో అగమ్యగోచరంగా చదువులు

జిల్లావ్యాప్తంగా 701 ఏకోపాధ్యాయ పాఠశాలలు

ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పడం ఎంత కష్టమో వారిని పర్యవేక్షించడం అంతకన్నా కష్టమని ఉపాద్యాయు లు చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లో ఈ సమస్యను ఎదుర్కొవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏకోపాధ్యా య స్కూళ్లలో పర్యవేక్షణ చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నట్లు సమాచారం.

ఆ ఒక్కరు సెలవు పెడితే! 1
1/2

ఆ ఒక్కరు సెలవు పెడితే!

ఆ ఒక్కరు సెలవు పెడితే! 2
2/2

ఆ ఒక్కరు సెలవు పెడితే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement