
24న టీటీసీ ఽఽథియరీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని మున్సి పల్ హైస్కూల్లో ఈ నెల 24వ తేదీ టీటీసీ థియరీ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు, అదే రోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు , అదే విధంగా సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇలా వరుసగా మూడు సెషన్స్‌గా మూడు పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను www.bre.ap.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు వారి హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపుకార్డుతో ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని డీఈఓ సూచించారు.
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ౖఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్లానింగ్, ఫైన్ ఆర్ట్స్ విభాగాలకు సంబంధించిన 2,4,6వ సెమిష్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. విశ్వనాథ్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి 162 మంది విద్యార్థులకుగాను 134 మంది ఉత్తీర్ణత సాధించగా 28 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటి అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఫణీంద్రరెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయ్‌ప్రకాష్‌రెడ్డి,నారాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు యాఖూబియా బగ్దాదియా ఉరుసు
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని షాహీపేటలో బగ్దాదియా పీఠం ఆధ్వర్యంలో బుధవారం హజరత్ మౌలానా సయ్యద్ షా మహమ్మద్ యాఖూబ్ బగ్దాది సాహెబ్ 26వ ఉరుసు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి హజరత్ మహ మ్మద్ అలీ బగ్దాదీ తెలిపారు. ఉరుసు సందర్భంగా సాయంత్రం అసర్ నమాజు తర్వాత ఖురాన్ పఠనం, జల్సా అజ్‌మత్ ఏ ఔలియా, రాత్రి ఫాతెహా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హజరత్ యాఖూబ్ బగ్దాది సాహెబ్ స్థాపించిన జామియా ఇస్లామియా మదరసాలో పిల్లలకు ఉచిత విద్య తది తర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఉరుసును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

24న టీటీసీ ఽఽథియరీ పరీక్ష