
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో రెండు వారాల నుంచి వర్షాలు కొనసాగుతూనే ఉన్నా యి. కడప, ప్రొద్దుటూరు లాంటి పట్టణాల్లో అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటితో నిండి జనాలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఆర్థరాత్రి నుంచి కురిసిన వర్షాల వివరాలు ఇలా ఉన్నా యి. పోరుమామిళ్లలో అత్యధికంగా 23.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే కలసపాడులో 11 , సింహాద్రిపురంలో 8.2, పెద్దముడియంలో 6.4 , కాశినాయన, వేములలో 6 , కొండాపురం, సిద్దవటంలో 3.6, జమ్మలమడుగులో 3.4, వేంపల్లిలో 3.2, ఎర్రగుంట్లలో 3, కమలాపురంలో 2.4, కడపలో 2.2, బి.మఠంలో 2 , మైదుకూరు, దువ్వూరులలో 1.8, ముద్దనూరులో 1.6, బద్వేల్‌లో 1.2, అట్లూరులో 0.8 మి.మీ వర్షపాతం నమోదైంది.