
ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం
పులివెందుల/వేంపల్లె: ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలతో కలిసి పులివెందుల మండల పరిధిలోని చంద్రగిరి, ఇ.కొత్తపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారానికి వెళ్లిన నాయకులకు ఆ గ్రామ అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఎక్కడ చూసినా బాణా సంచా పేల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను వింటూ ప్రచారాన్ని ముందుకు సాగించారు. త్వరలోనే గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఆయా గ్రామాల ప్రజల ఉత్సాహాన్ని చూసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కచ్చితంగా అఖండ మెజార్టీతో గెలవడం తథ్యమని పేర్కొన్నారు. మాట తప్పని.. మడమ తిప్పని కుటుంబం వైఎస్సార్ కుటుంబమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదన్నారు. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన పథకాలైన విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను నీరుగార్చారన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయంటే అది కేవలం వైఎస్ కుటుంబంతోనేనన్నారు.
ప్రజల నుంచి విశేష స్పందన
ప్రచారంలో ప్రజల నుంచి వైఎస్సార్‌సీపీకి విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రభోవాలు పెట్టినా.. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రజలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఏడాదికి రూ.18వేలు అని నమ్మబలికి ఏ పథకం అమలు చేయలేదని వారు పేర్కొ న్నారు. కావున జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటూ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు బలరామిరెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మోహన్ రెడ్డి, బాల గంగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆది, చంద్ర, గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి
వైఎస్సార్‌సీపీలో చేరుతున్న నాయకులు
జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
ఐదు రోజులుగా జోరుగాజెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం
పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామంలో టీడీపీ నుంచి 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. శుక్రవారం జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో బాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కడప ఎంపీ వైఎస్ అవినాస్‌రెడ్డి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో చేస్తున్న దాడులు, హింసలు, అరాచకాలను చూసి ఇష్టపడక వైఎస్సార్‌సీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, బలరామిరెడ్డిలకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.

ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం