ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్‌సీపీదే | - | Sakshi
Sakshi News home page

ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్‌సీపీదే

Aug 10 2025 5:50 AM | Updated on Aug 10 2025 5:50 AM

ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్‌సీపీదే

ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్సార్‌సీపీదే

ఒంటిమిట్ట: తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించేది వైఎస్సార్‌సీపీయేనని వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేశారు. .శనివారం మండల పరిధిలోని మంటపంపల్లి, రామచంద్రాపురం, అచ్చంపేట, ఎస్టీ కాలనీ, పెన్నపేరూరు గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్‌ పరిశీలకులు అజయ్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి ఇరగంరెడ్డి సు బ్బారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట, పులివెందుల అభ్యర్థులను గెలిపించి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి బహుమతిగా అందిస్తామన్నారు.

● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని అన్నారు.

● వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారని, కేవలం 8 నెలలు ఉన్న ఈ పదవికి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు.

● ఓటర్లను కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు.

● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ..ముస్లిం, మైనారిటీలకు మేలు చేసింది ఎవరంటే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇంతటి మేలు చేసిన వారికి మద్దతుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సుబ్బారెడ్డి ని గెలిపించాలని కోరారు.

● రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ..కుప్పంలో గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడంతో సీఎం చంద్రబాబు అవమానాన్ని భరించలేక వైఎస్‌ జగన్‌ ఇలాక అయిన కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ ని ఓడించి జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారన్నారు.

● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. కడప పార్లమెంట్‌ పరిశీలకులు అజయ్‌ రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement