పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం
పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగిరియంపల్లె గ్రామానికి చెందిన రైతు నడిపి సుబ్బారెడ్డి పొలంలో మంగళవారం వినాయక విగ్రహం బయల్పడింది. వెల్లటూరు గ్రామ రెవెన్యూ భూమిలోని భేతాళ ఆంజనేయస్వామి గుడి దగ్గరలోని పొలంలో.. ఆయన ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా గొర్రుకు పెద్ద రాయి తగిలింది. దానిని వెలికితీయగా వినాయక విగ్రహం కనిపించింది. దీంతో సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని వినాయక విగ్రహానికి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. పూర్వం ఈ ప్రదేశంలో గుడి ఉండి ఉంటుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
విలువలతో కూడిన
విద్య అందించాలి
కడప ఎడ్యుకేషన్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప జయనగర్ కాలనీలో బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజైన మంగళవారం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు చేరవేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, డీసీఈబీ సెక్రటరీ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌సీఆర్‌టీ అబ్జర్వర్ బ్రహ్మానందరెడ్డి, డైట్ లెక్చరర్లు గిరిబాబు, రెడ్డెయ్య, స్టేట్ రీసోర్సు పర్సన్స్ సుబ్బానాయుడు, గంగాధర్, తిరుమల కొండ, సురేష్‌కుమార్‌రెడ్డి, కృష్ణానాయక్, బాబాసాహేబ్ తదితరులు పాల్గొన్నారు.
7న యోగాంధ్ర
రాయచోటి : ఈనెల 7న తాళ్లపాక అన్నమయ్య సన్నిధిలో అత్యంత వేడుకగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 617 మందితో యోగాసనాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పొలంలో బయల్పడిన వినాయక విగ్రహం


