ఆయనో జూనియర్ అసిస్టెంట్. మున్సిపాలిటిలో పెట్రోల్ బంక
స్పెషలాఫీసర్‌ను నియమించాం
● పెట్రోల్ పంపు నిర్వహణలో
మున్సిపల్ ఉద్యోగి చేతివాటం
● మున్సిపల్ ఆదాయాన్ని
దర్జాగా దోచేసిన వైనం
● ఎంచక్కా ప్రమోషన్‌పై బదిలీ..
సహకరించిన కమిషనర్
సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ పెట్రోలు బంకు నిర్వహణ బాధ్యతలు చూ సేవారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి స్కెచ్ వేశారు. కోటి రూపాయలకు పైగా కుచ్చుటోపీ వేసి ఇంధనం పక్కదారి పట్టించారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలకు 2022–25 వరకూ రూ. 1,23,47,318ల విలువగల పెట్రోలు, డీజల్‌ను అప్పుగా పట్టినట్లు, వారి నుంచి డబ్బులు రావాలంటూ తాపీగా వెల్లడించారు. ఇంత మొత్తం పెండింగ్‌లో ఉంటే పెట్రోల్ పంపు నిర్వహణ సాధ్యమా?అనేది ప్రశ్నార్థకం. వచ్చే ఆదాయం మొత్తం స్వాహా చేసి ప్రొద్దుటూరులో లేని ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లు పొందుపర్చినట్లు కొందరు వివరిస్తున్నారు. మాతాంగి ట్రావెల్స్ 2023వ సంవత్సరం నుంచి 2025 అక్టోబరు నెల వరకు అప్పు రూ. 13,75,344 ఉన్నట్లు లెక్క రాశారు. ఈ ట్రావెల్స్ ప్రొద్దుటూరులో ఉన్నట్లు రికార్డుల్లో లేకపోవడం విశేషం.
అధికారులూ అమ్ముడుబోయారా!
ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని త్రీ టౌన్ పోలీసుస్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పెట్రోలు బంకును 2021 ఆగస్టు 18న ప్రారంభించారు. అప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్‌కుమార్ పెట్రోలు బంకు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. పెట్రోల్ పంపు ద్వారా మున్సిపాలిటికి ఆదాయం లభించకపోవడంతో ఇటీవల కమిషనర్ రికార్డులు పరిశీలించారు. దాంతో ఒక్కమారుగా వ్యవహారం బహిర్గతం అయ్యింది. రూ.1.23కోట్లు విలువజేసే పెట్రోలు, డీజల్‌ను ప్రైవేటు వ్యక్తులకు అధికారుల అనుమతి లేకుండా అప్పుగా ఇవ్వడం వెలు గులోకి వచ్చింది. ఎవరి అనుమతి తీసుకుని మేనేజర్‌గా పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ అప్పులు ఇచ్చా రు అన్న ప్రశ్నలకు సమధానం లేదు. వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన కమిషనర్ సైతం మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు లోబడి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
కమిషనరా మజాకా !
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తన సొంతమైనట్లు తాను ఆడిందే ఆట...పాడిందే పాటగా అన్నట్లుగా వ్యవహరించారు. పెట్రోల్ పంపు నిర్వహణలో లెక్కాపత్రం లేని రూ.1.23కోట్ల అవినీతిపై కమిషనర్ నాన్చుడు ధోరణి అవలంబించారు. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ సీసీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఓబులేసు తనకు తెలియకుండా అజెండాలో లేని అంశాలను పొందుపరిచారని, అతన్నిసస్పెండ్ చేయాలంటూ సిఫార్సులు చేశారు. ఒకే మున్సిపాలిటిలో పని చేసే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఒకరిపై ఒకలా, మరొకరిపై ఇంకోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెట్రోల్ పంపు నిర్వహణలోని లోపాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు స్పెషల్ ఆడిట్ ఆఫీసర్‌ను నియమించాం. సదరు అధికారి క్షుణ్ణంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వారంలో నివేదిక వస్తుంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదు పరి చర్యలు తీసుకుంటాం. –రవిచంద్రారెడ్డి,
కమిషనర్,ప్రొద్దుటూరు మున్సిపాలిటీ
ఆయనో జూనియర్ అసిస్టెంట్. మున్సిపాలిటిలో పెట్రోల్ బంక


