24 నుంచి ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ 2025–26 ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఈ నెల 24 నుంచి 27 వరకు ఆంధ్ర–సౌరాష్ట్ర జట్ల మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భరత్‌రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఇరు జట్లు కడపకు చేరుకున్నాయి.
ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకోండి
బద్వేలు : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం బద్వేలు ఆర్టీసీ డిపో సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సు సర్వీసులను బెంగుళూరు నుంచి బద్వేలుకు నడుపుతున్నట్లు బద్వేలు డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు.ఈ స్పెషల్ సర్వీస్‌లు 24వ తేది బుధవారం రాత్రి 10.55 నిలకు (సర్వీస్ నెంబర్ 94175)ఉంటుందని తెలిపారు.అలాగే రెగ్యులర్ సర్వీస్‌లు బెంగుళూరు నుంచి రాత్రి 10.45ని.(సర్వీస్ నెం.6208), రాత్రి 11.30 ని.(సర్వీస్ నెం.6238) అలాగే 25వ తేది గురువారం తెల్లవారుజామున 4.30 ని. (సర్వీస్ నెం.6204) 5.30ని. (సర్వీస్ నెం.6206) సర్వీసులు ఉన్నాయని వివరించారు. వివరాలకు కోసం 9959225779 మొబైల్ నెంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్ తెలిపారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్
కడప ఎడ్యుకేషన్ : వచ్చే ఏడాది జనవరి 26న డిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు యోగి వేమన విశ్వవిద్యాలయం ఎన్.ఎస్.ఎస్ వలంటీర్ బొగ్గవరపు ఈశ్వర్ ఎంపికయ్యారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు, స్పెషల్ క్యాంపులలో, ఎన్.ఎస్.ఎస్. కార్యకలాపాలలో ఈ విద్యార్థి చురుగ్గా పాల్గొనడం వల్ల పెరేడ్ కు ఎంపిక చేశారని ప్రొగ్రాం ఆఫీసర్ డా.కె. లలిత తెలిపారు. ఈశ్వర్‌ను వీసీ బెల్లంకొండ రాజశేఖర్, రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొ శ్రీనివాస్, ఎన్.ఎస్.ఎస్. సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి అభినందించారు.
పల్లకిలో ఊరేగిన వీరభద్రుడు
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడు పల్లకిలో ఊరేగారు. సోమవారం రాత్రి ఆలయ మూల విరాట్ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి, శ్రీ భద్రకాళీ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
24 నుంచి ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లు


