నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు
కడప సెవెన్‌రోడ్స్ : కడప నగర శివార్లలోని మాచుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షావలీ దర్గా ఉరుసు ఉత్సవాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈనెల 23న గంధోత్సవం సందర్భంగా రాత్రి 9 గంటలకు గంధం, పూలచాందిని ఫకీర్ల మేళతాళాలతో, బ్యాండు వాయిద్యాలతో గ్రామంలో మెరవణి నిర్వహించి గురువుల మజార్‌వద్ద సమర్పిస్తామన్నారు. అనంతరం ఫాతెహా ఉంటుందని పేర్కొన్నారు. 24న ఉరుసు సందర్భంగా వివిధ కార్యక్రమాలతోపాటు రాత్రి ఖవ్వాలీ కచేరి ఉంటుందన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని అన్నదానం నిర్వహిస్తామన్నారు. 25న తహలీల్ ఫాతెహాతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
ఒంటిమిట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పుజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, ముత్యాల ఆభరణాలు తొడిగి, పట్టు వస్త్రాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత పారాయణం చేశారు.
నేటి నుంచి మాచుపల్లి దర్గా ఉరుసు


