నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమవుతారు. ఇడుపులపాయలో, పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
తొలిరోజు పర్యటన ఇలా..
ఈనెల 23వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరు ఎయిర్‌డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరుతారు. సాయంత్రం 4గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.15గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు. 4.15గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు పర్యటన ఇలా..
24వ తేదీ బుధవారం ఉదయం 9.30గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయలోని ప్రేయర్ హాలు వద్దకు బయలుదేరుతారు. 10.30గంటలకు అక్క డికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రేయర్ హాలు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. మధ్యా హ్నం 1గంటకు ఇడుపులపాయ ప్రేయర్ హాలు వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2గంటలకు పులివెందుల భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
మూడో రోజు క్రిస్మస్ ప్రార్థనల్లో
పాల్గొననున్న మాజీ సీఎం
25వ తేదీ క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం 8.10గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి పులివెందుల సీఎస్‌ఐ చర్చి వద్దకు బయలుదేరుతారు. 8.30గంటలకు పులివెందుల సీఎస్‌ఐ చర్చి వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 10గంటల వరకు పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 10.20గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.30గంటలకు హెలీకాప్టర్ ద్వారా బెంగుళూరుకు బయలుదేరుతారు.
నేడు పులివెందులకు
చేరుకోనున్న వైఎస్ జగన్
ప్రజలతో మమేకం కానున్న మాజీ సీఎం
24వ తేదీ ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు, పులివెందులలో ప్రజా దర్బార్
25వ తేదీన క్రిస్మస్ సందర్భంగాపులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు


