మోదీ సహకారంతో సూపర్ సిక్స్ పథకాల అమలు
కడప రూరల్ : ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల ద్వారా వైఎస్సార్‌సీపీ కనుమరుగవుతుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ లిక్కర్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్, వైఎస్.అవినాష్‌రెడ్డి పలు అంశాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. లిక్కర్‌తో పాటు ఇతర అవినీతి, ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి అరెస్టవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, విజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి


