ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
మైదుకూరు : బైక్‌ల చోరీపై పోలీసులు చేపట్టిన నిఘాతో ఏకంగా ఇద్దరు అంతర్ జిల్లాల బైక్ దొంగలు శుక్రవారం మైదుకూరు అర్బన్ పోలీసులు పట్టుబడ్డారు. వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో చోరీ చేసిన ఎనిమిది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ కేవీ.రమణారెడ్డి వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన కొప్పోలి జాయ్, ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన చాపాటి పవన్, మరో ముగ్గురు మైనర్లతో కలిసి చోరీలకు అలవాటు పడ్డారు. మైదుకూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి, అనంతపురం జిల్లా తాడిపత్రి, నంద్యాల జిల్లా చాగలమర్రి, సిరివెళ్ల, కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటి ఎదుట పార్కు చేసిన బైక్‌లను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు మైదుకూరు– ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులోని వంతెన వద్ద ఇద్దరినీ అరెస్టు చేశారు. మరో ముగ్గురు మైనర్లు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. రూ.10 లక్షల విలువలైన 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన అర్బన్ ఎస్‌ఐ సుబ్బారావు, సిబ్బంది భాస్కర్‌రెడ్డి, వెంకటకిరణ్, ప్రసాద్‌రాజు, శివగణేష్, నవీన్, తిరుమలయ్య, ప్రసాద్‌లను డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారని సీఐ పేర్కొన్నారు. వారికి రివార్డులు అందజేస్తామన్నారు. బైక్‌లను పార్కు చేసే సమయంలో సైడ్ లాక్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఊర్లకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్ ఎస్‌ఐ సుబ్బారావు, ఏఎస్‌ఐలు శివప్రసాద్ రెడ్డి, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు


