కొనసాగుతున్న నిరసన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నిరసన

Apr 9 2025 12:27 AM | Updated on Apr 9 2025 12:27 AM

కొనసా

కొనసాగుతున్న నిరసన

జమ్మలమడుగు : క్యాంప్‌బెల్‌ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిరసన మంగళవారం రెండో రోజు కూడా కొనసాగింది. సీఎస్‌ఐ క్యాంప్‌బెల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అగస్టీన్‌రాజును తొలగించడం అన్యాయమని ఆయనను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైస్‌ చైర్మన్‌ ప్రత్యూష మాట్లాడుతూ యలసీమ డయాసిస్‌లో ఎలాంటి సమావేశం జరగకుండా, ఓటింగ్‌ నిర్వహించకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇలా ఎవరుపడితే వారు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని ఆసుపత్రి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారన్నారు.

బెల్టు షాపులపై విస్తృత దాడులు

కమలాపురం/ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల ఎకై ్సజ్‌ శాఖ పరిధిలో కమలాపురంలో నిర్వహిస్తున్న బెల్టు షాపులపై విజయవాడ నుంచి వచ్చిన ఎస్‌టీఎఫ్‌ బృందం దాడులు నిర్వహించినట్లు ఎర్రగుంట్ల ఎకై ్సజ్‌ శాఖ సీఐ గోపీక్రిష్ణ తెలిపారు. మంగళవారం ఎర్రగుంట్ల ఎకై ్సజ్‌ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కమలాపురంలో విస్తృతంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఎస్‌టీఎఫ్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ వర్మకు ఫిర్యాదులు అందాయన్నారు. ఆ మేరకు విజయవాడ నుంచి ఎస్‌టీఎఫ్‌ స్క్వాడ్‌ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కమలాపురంలో ఉన్న రెండు బెల్టు షాపులపై దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడులలో రాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టు షాపు నుంచి 44 మద్యం బాటిళ్లు, శంకర్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టుషాపు నుంచి 41 బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి తీవ్ర గాయాలు

ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... బి.కొత్తకోట మండలం ఎగువ శీతివారిపల్లెకు చెందిన రమేష్‌(23) పనుల మీద బురకాయలకోటకు ద్విచక్రవాహనంలో వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బురకాయలకోట బైపాస్‌ వద్ద ఎదురుగా వస్తున్న కోటేశ్వర్‌రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రమేష్‌కి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొనసాగుతున్న నిరసన 1
1/1

కొనసాగుతున్న నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement