కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని పోలీస్ క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక పిచ్ రోలర్‌ను జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ సోమవారం ప్రారంభించారు. రోలర్‌కు జిల్లా ఎస్పీ పూజ నిర్వహించి స్వయంగా డ్రైవ్ చేసి పరిశీలించారు. వర్షానికి గ్రౌండ్ తడవకుండా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వాటర్ ప్రూఫ్ గ్రౌండ్ షీట్‌ను కూడా పరిశీలించారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది క్రీడల ద్వారా నూతనోత్తేజం పొందవచ్చని, స్టేడియంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఇతరులు కూడా స్టేడియంను అద్దె ప్రాతిపదికన ఉపయోగించుకోవచ్చన్నారు. వివరాలకు 9121100641 లేదా 9000144343 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య , ఆర్.ఐ లు టైటస్, ఆనంద్, వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు.